ఒక్క చిన్న ఐడియాతో … చిన్నారి కోటీశ్వరురాలు అయ్యింది.
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనే మాటని నిజం చేసింది .పదకొండేళ్ల మికైలా ఉల్మర్ ఒకరోజు టీవీలో వస్తున్న ఓ కార్యక్రమం చూస్తుండగా తళుక్కున ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఆ చిన్నారిని కోట్ల వ్యాపారానికి అధిపతిని చేస్తుందని ఊహించ లేదు. ఎప్పటిలాగే మికైలా ఆ రోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చి రోజు మాదిరిగానే హోం వర్క్ చేసుకుని టీవీ చూడటానికి కూర్చుంది. ఏబీసీ అనే చానెల్‌లో‘షార్క్‌ట్యాంక్’అనే కార్యక్రమం వస్తోంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సరికొత్త ఆవిష్కరణలను, వ్యాపార ఆలోచలను ప్రోత్సహించడమే.
మన ఆలోచన వారికి నచ్చితే వారే మనకు పెట్టుబడి పెడుతారు. ఈ విషయాన్ని అర్ధమైన మికైలాకు ఇంట్లో అమ్మమ్మ చేసే నిమ్మరసం గుర్తొచ్చింది. మికైలా అమ్మమ్మ అందరిలా కాకుండా నిమ్మరసం కొత్తగా చేసేది. ..ఎంటంటే మనం మాములుగా అయితే నిమ్మరసంలో ఉప్పు లేద పంచదార కలుపుతాం కానీ మికైలా అమ్మమ్మ పంచదార బదులు తేనె, అవిసె గింజలను వేసి చేస్తుంది.
ఇదే ఆలోచననతో మెదడుకు పదును పెట్టింది. షో నిర్వాహకుల ముందు ఉంచి రుచి చూపించింది. నిమ్మరసం రుచి విపరీతంగా నచ్చి , దాదాపు 40 లక్షల రూపాయల్ని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. పెట్టుబడిదారు అందించిన ప్రోత్సహాంతో మికైలా ‘బీ స్వీట్ లెమెనెడ్’అనే కంపెనీని స్థాపించింది. ఈ నిమ్మరసం రుచి బాగా ఉండటంతో త్వరలోనే వ్యాపారం చాలా వృద్ది చెందింది. ప్రస్తుతం ఈ నిమ్మరసం ఐదు రాష్ట్రాలలో విస్తరించిన మికైలా, మరి కొద్దిరోజుల్లోనే దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళాడనికి ప్రయత్నాలు చేస్తుంది.
మికైలా ఇప్పుడు ఆరవ తరగతి చదువుతోంది. మికైలా ఒకవైపు చదువుకుంటూనే మరో వైపు వ్యాపారం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ లెమెనెడ్ పానీయానికి ఫ్యాన్ అయ్యాడు. గూగుల్ సీఈవో సత్య నాదెళ్ల ఈ చిన్నారి వ్యాపారవేత్తను మనస్ఫూర్తిగా అభినందించాడు.