ఒక లక్ష అరవై వేల జాతీయ పతాకాలు సిద్ధం
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాలు ఇప్పటికీ ఒక లక్ష అరవై వేలు జిల్లాకు వచ్చినట్లు , ఇంకా ఒక లక్ష జాతీయ పతాకలు జిల్లాకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 6 మున్సిపాలిటీ లకు నలబై వేలు జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయితీలకు కలిపి ఒక లక్ష ఇరవై వేలు పంపిణీ చేసేందుకు సంబందిత అధికారుల ద్వారా అందజేయడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి జాతీయ పతాకని అందజేసే విధంగా ప్రణాళిక రూపొందించిన్నట్లు , ప్రతి చోట ఫ్లాగ్ కోడ్ పరిపూర్ణంగా అమలు అయేల చూడాలని , మువ్వనెల జెండా గౌరవానికి బంగం వాటిల్ల కుండ ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని జిల్లా స్థాయి, మండల స్థాయి , గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తమ తమ ఇండ్ల పై జాతీయ పతాకని ఎగురవేసేలా క్షేత్ర స్థాయిలో కృషి చేయాలని ఆమె అన్నారు. ప్రజలకు త్రివర్ణ పతాకం ఎగురవేసే విధానం గురించి తెలియజేయాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్లాగ్ కోడ్ తప్పనిసరిగా అమలు చేసే విధంగా అధికారులు అందరూ జాగ్రతలు వహించాలని కలెక్టర్ సూచించారు.
వేడుకలలో బాగంగా 10వ తేదీన వన మహోత్సవం సందర్భంగా కనీసం 75 మొక్కలు నాటేందుకు కృషి చేయాలని, ప్రతి గ్రామ పంచాయితిలో మున్సిపాలిటీ పరిధిలో , ప్రభుత్వ కార్యాలయాలో , ఇతర ఖాళీ ప్రదేశాలలో 75 అక్షరం వచ్చే విధంగా మొక్కలు నాటలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, స్వచ్చంద సంస్థలను, పాఠశాల విధ్యార్ధులను,ఉద్యోగస్తులను , ఉపాధ్యాయులను బాగస్వాములను చేయాలని కలెక్టర్ అన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల స్సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఎంట్రెన్స్ లో 75 అక్షరం వచ్చే విధంగా మొక్కలు నాటలని ఇది కార్యాలయాలకు , పాఠశాలలల్కు వచ్చిన వెంటనే కనబడేటట్టు ఉండాలని, జిల్లాలోని అన్నీ పాఠశాలలో దేశ భక్తి గీతాల పై \పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.