ఒడిశా పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్ సభ్యుడు గులాం అహ్మద్‌ను తప్పించాలన్న ఒడిశా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఒడిశా అడిగిన అనుమతిని సైతం తిరస్కరించింది. డిసెంబర్ 3 నుంచి వంశధార ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి.