ఒబామాకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
ఢిల్లీ: నల్లసూరీడు బరాక్ ఒబామా తెల్లకోటలో మళ్లీ పాగవేయడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుపొందిన బరాక్ ఒబామాకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.