ఓగులాపూర్ లో వినాయక మండపం వద్ద అన్నదానం..

 

ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి..

జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 3:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో శ్రీ రామాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల సందర్భంగా శనివారం ఉదయం హనుమాన్ టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, ఉపసర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్వాహకులు ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలతో సుఖసంతోషాలతో ఉండే పంటలు బాగా పండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు ఇల్లందుల రాజయ్య, ఇంద్ర నారాయణ,ఎండ్రా అంజయ్య, శంకర్, శ్రీనివాస్, అశోక్,రాజయ్య,పెందోటి వెంకటాచారి,మునిగంటి భూపతి, ఇల్లందుల రమణాచారి, సమ్మెట సంజీవ్,కొమురయ్య, సందేని రాజయ్య, ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.