ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్న కోహ్లీ

Indian-cricketer-Virat-Kohli-addresses-a-press-conference-at-Sardar-Patel-Cricket-Stadium-in-Ahmedabad2న్యూఢిల్లీ,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వరల్డ్‌ టీ 20లో తమ జట్టు కొన్ని విజయాల్ని, కొన్ని పరాజయాల్ని ఎదుర్కొన్నా అభిమానులు అందించిన సహకారం మరువలేనిదని టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి విరాట్‌ ధన్యవాదాలు తెలిపాడు. అయితే టీమిండియా జట్టు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతుందని కోహ్లి అన్నాడు. ‘మా జట్టు విజయాలతో పాటు పరాజయాల్ని కూడా చూసింది. వరల్డ్‌ టీ 20 టోర్నీ అందించిన  జ్ఞాపకాలు ప్రత్యేకం.  ఆ జ్ఞాపకాలతోనే రాబోయే టోర్నీలకు సిద్ధమవుతాం. ఈ టోర్నీలో భారత ప్రదర్శనపై అభిమానుల నుంచి సానుకూల స్పందన వచ్చింది’ అని విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో తెలిపాడు.  టీ20 వరల్డ్‌ కప్‌ 2016 సెవిూస్‌ మ్యాచ్‌లో విండీస్‌ చేతిలో ధోని సేన ఓటమి పాలైన తర్వాత  భారతావని భావోద్వేగానికి గురయ్యింది. భారత జట్టు సభ్యులలంతా చాలా నొచ్చుకున్నారు. సూపర్‌ స్టార్‌ కోహ్లీ మరింత మనస్థాపం చెందాడు. సహజంగానే దూకుడుగా ఉండే విరాట్‌ భావేద్వేగాల విషయంలో కూడా అంతే. సహచర ఆటగాళ్లకు, అభిమానులకు కలిపి సోషల్‌ విూడియాలో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. వరల్డ్‌ కప్‌ నుంచి భారత్‌ వైదొలిగిన తర్వాత తన మనసులోని ఆలోచనలను జట్టు సభ్యులతో పాటు అభిమానులతో కూడా పంచుకున్నాడు.  గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం కానీ జ్ఞాపకాలను మాత్రం వెంట తీసుకువెళ్తాం. చేసిన తప్పుల నుండి నేర్చుకుని ముందుకు వెళ్లాలి. ఈ టోర్నమెంట్‌ను ఓ తీపి జ్ఞాపకంగా మిగిల్చినందుకు అందరికి కృతజ్ఞతలు. నిరంతరం మద్దతు తెలిపినందుకు అభిమానులందరికి చాలా థ్యాంక్స్‌. విూరు ఉత్సాహంగా, సంతోషంగా ఉండటాన్ని చూస్తుండటం చాలా ఆనందకర విషయం. ఈ ఓటమిని మర్చిపోయి తర్వాతి ఆటకు సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకుని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తాం  అంటూ ముగించాడు. టోర్నీలో విరాట్‌ ఐదు మ్యాచ్‌ ల్లో మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 273 పరుగులు నమోదు చేశాడు. విరాట్‌ అద్భుతమైన ఆటతీరుతో సెవిూస్‌ వరకు వెళ్లిన టీమింటియా.. వెస్టిండీస్‌ చేతిలో

ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వైదొలిగింది. విండీస్‌తో మంచి ఆటతీరు ప్రదర్శించినా గెలవలేకపోయారు. ఇకపోతే సెవిూ ఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు నిస్పృహతో ఇంటిదారి పట్టారు. వాంఖడే స్టేడియం నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా సెక్యూరిటీ చెక్‌ కోసం వెళ్లాడు. మ్యాచ్‌ ఓడిపోతేనే జట్టు సభ్యులను తిట్టిపోసే అభిమానులు ఈ సారి సహనం ప్రదర్శించారు. పాపం కోహ్లీ అంటూ నిట్టూర్చారు. ఎయిర్‌పోర్టులో కోహ్లీని చూసిన అభిమానులంతా ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ నినాదాలు చేస్తూ.. ‘వియ్‌ ఆర్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ కోహ్లీ’ అంటూ అభినందించారు. మ్యాచ్‌ ఓడిపోయినదానికంటే… కోహ్లీ కష్టం అంతా వృథా అయిందనే బాధనే అభిమానులను ఎక్కువగా వేధించింది. ఎయిర్‌పోర్టులో కోహ్లీతో పాటు ఆశిశ్‌ నెహ్రా, కెప్టెన్‌ ధోనీ, జాస్పిట్ర్‌ బూమ్రా ఉన్నారు. వీరికి సెండ్‌ ఆఫ్‌ చెప్పడానికి వచ్చిన టీమ్‌ మేనేజర్‌ కపిల్‌ మల్హోత్రాతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చే సమయంలో చిన్న చిరునవ్వుతో తన శాంతి స్వభావాన్ని మరోసారి బయటపెట్టాడు కెప్టెన్‌ ధోనీ. మిగిలిన సభ్యులు మనోవేదనతోనే మల్హోత్రాను పలకరించి ఫ్లయిట్‌ ఎక్కేశారు.