ఓటరు నమోదుపై ప్రత్యేక గ్రామసభ.

బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఓటరు నమోదుపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితా సహకరించాలని కోరారు. అనంతరం ఓటరు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ డోలే సురేష్, పంచాయతీ కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులు, బూత్ లెవల్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు