ఓటర్ల నమోదుకు గడువు పొడగింపు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకలు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడగించింది. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్‌ 15వ తేదీకి పొడిగిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలు, ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిసెంబర్‌ 15వ తేదీన ప్రకటించాలని నిర్ణయించింది. దరఖాస్తుల వివరాల, కంప్యూటరైజేషన్‌, వంద శాతం ఫోటోల సేకరణ, ఓటర్ల జాబితాను డిసెండర్‌ 31 వరకు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అధికారి మనోహర్‌ పేర్కొన్నారు.