ఓటర్ జాబితా రూపకల్పన ప్రక్రియను పక్కగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి
ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు ఆదివారం.వికారాబాద్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ శిబిరాల కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఎల్ఓ లు తమ పరిధిలో ఓటరు జాబితా రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించి స్పష్టమైన, తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించాలన్నారు. ఇప్పుడు రూపొందించే ఓటరు జాబితా రాబోవు అన్ని ఎన్నికలకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి, ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఓటర్ జాబితాలో ఇప్పటికే డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారూ ఉన్నందున, అట్టి పేర్లను గుర్తించి తొలగించేందుకు ఇంటింటికి వెళ్లి అన్ని వివరాలు సేకరించి తప్పులు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని బి ఎల్ ఓ లకు సూచించారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రాలను, శివరాంనగర్ లోని బాల్ భవన్ లో గల పోలింగ్ కేంద్రాలు అలాగే వెంకటపూర్ తండా లో గల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ జాకీర్ హుస్సేన్, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్, ఆర్ ఐ లు తదితరులు పాల్గొన్నారు.