ఓటిఎస్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం
పేదలకు ఉరి బిగిస్తున్నారన్న టిడిపినేత చంద్రబాబు
పేదలకు మేలు చేయాలన్నదే జగన్ సంకల్పం
కౌంటర్ ఇచ్చన ప్రభుత్వ సలహాదారు సజ్జల
అమరావతి,డిసెంబర్6(జనం సాక్షి ) : జగనన్న శాశ్వత గహహక్కు ఓటీఎస్‌పై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓటీఎస్‌తో పేదల మెడకు ఉరి వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించగా.. ఓటీఎస్‌పై చంద్రబాబు రాద్దాంతం అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ పై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం పేదల మెడకు ఉరి వేస్తున్నదని ఆరోపించారు. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటని చంద్రబాబు నిలదీశారు. కంపల్సరీ కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని? బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు చేస్తుంటే కేసులు పెడతారా..? అని నిలదీశారు. బొబ్బిలిలోని ఓటీఎస్ బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, ఆ బాలుడికి వైద్య ఖర్చులు టీడీపీ భరిస్తుందని హావిూ ఇచ్చారు.కాగా, చంద్రబాబు మాటలకు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్‌పై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ విషయంలో ఎవర్ని ఎవరూ బలవంతపెట్టడం లేదన్నారు. చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. చంద్రాబు వడ్డీ మాఫీ చేసిన రోజు కూడా పేదలకు ఇల్లు సొంతం కాలేదని, కానీ నేడు రిజిస్టేష్రన్ భారం లేకుండా ప్రజలకు సంపూర్ణ హక్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా ఆదాయం వచ్చేది ఏవిూ లేదని, ఇంత సౌలభ్యం ఉన్న పథకంపై దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మందికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టిస్తోందని సజ్జల పేర్కొన్నారు. ఓటీఎస్ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఏవిూ చేయలేదని చెప్పారు. ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటీఎస్ విషయంలో ఎవరూ బలవంతం పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబుపై సజ్జల కౌంటర్ అటాక్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో వన్ టైం సెటిల్ మెంట్ పెట్టారని, దానికి సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు చెప్పడం విడ్డురమన్నారు. పేదలకు భారీగా మేలు జరుగుతుంటే ఎందుకు ఈ పిలుపని ప్రశ్నించారు. ’చంద్రబాబు అసలు ఈ విషయాలపై మాట్లాడే హక్కే లేదు. తన హయాంలో ఏవిూ చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటాడు. 2014లో గెలిచాక కనీసం వారికి వడ్డీ కూడా మాఫీ చేయలేదు. ఏ ఫీజు పెట్టకపోతే వీల్లే అన్నీ ఉచితం అంటారు. లబ్దిదారులను రిక్వెస్ట్ చేస్తున్నాం. విూ పిల్లలకు ఓ మంచి ఆస్తిని ఇవ్వండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే చర్యలు ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు అనుకున్న ప్రకారమే పాలన నడవాలనుకోవడం ఆయన భ్రమ. చివరికి ప్రజల్ని కూడా తిట్టడం ఆయనకు అలవాటుగా మారింది. ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ఆలోచనలు కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన వారిపై ప్రేమే ఉంటుంది. చంద్రబాబు డీఎలు ఎగ్గొడితే మేము రాగానే ఐఆర్ ఇచ్చాం. కాస్త కోవిడ్ వల్ల ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే. కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నలుగురే ఉద్యోగులు కాదు కదా. ఒక వేళ వాళ్ళు నిర్ణాయక శక్తి అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లొచ్చు ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. కేంద్రమంత్రి అన్నమయ్య ప్రొజెక్టుపై కనీసం కేంద్ర బృందం పరిశీలనను కూడా తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. బహుశా ఆయన పక్క టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఏమైనా మాట్లాడిరచారేమో. కొన్ని తరాలుగా అక్కడ ఇంత స్థాయి వరద రాలేదు . ఏమి జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు .దాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు’ అని విమర్శించారు.