ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు
భాజపా నేత విద్యాసాగార్‌రావు
కరీంనగర్: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరి అమలు ఆలస్యమైనప్పటికీ హర్షిస్తున్నామని భాజపా సీనియర్ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. దేశంపై దాడి చేసే శక్తులకు ఈ ఉరి శిక్ష దీటైన సమాధానమని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఈ ఘటనను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు.