ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి,ఖమ్మం గొల్లగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు కాచీగూడలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వంటి పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లాలో పర్వతగిరి జెడ్పీఎస్ఎస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబర్‌పేట మున్సిపల్‌ మైదానంలోని పోలింగ్‌ బూత్‌లో డీజీపీ అంజనీకుమార్‌ దంపతులు ఓటు వేశారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు వనపర్తిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికల హైస్కూల్లో ఆయన ఓటు వేశారు.ఓటు హక్కును వినియోగించుకున్న శేర్లింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ. పరకాల పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. ముఖరంపూర్ ఉర్దూ మీడియం స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ బి. వినోద్‌. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం బయట మీడియా పలుకరించగా బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయమని అన్నారు.కుటుబంతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్న జగదీశ్‌రెడ్డి..ఫాతిమా కాన్వెంట్‌ స్కూల్‌ బూత్‌ నంబర్‌ 94లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబంతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. సతీమణి రమాదేవి, కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోనేరు వంశీ, ఆయన సతీమణి మధులికతో కలిసి ఓటు వేశారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని తన స్వగ్రామం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.బీఆర్‌ఎస్‌ మాలోత్‌ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఓటు వేశారు.

శ్రేయ వొకేషనల్ జూనియర్ కాలేజి, క్రిస్టియన్ కాలనీ బూత్ నంబర్ 179 లో లో తన ఓటు హక్కు వినియోగించు కున్న కరీంనగర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్.. మరియు కుటుంబ సభ్యులు

 

 

తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పురముల శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ

 

 

 

 

 

 

బి ఆర్ ఎస్ అభ్యర్థి మాకునూరు సంజయ్ కుమార్

దంపతులు

 

 

 

 

 

ఓటు హక్కు వినియోగించుకున్న నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్30( జనం సాక్షి) నాగర్కర్నూల్ నియోజకవర్గం తిమ్మాజీపేట్ మండలంలోని తమ స్వగ్రామమైన నేరాళ్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి, సతీమణి మర్రి జమున గ డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున హాజరై రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరారు…

 

ఓటు హక్కు వినియోగించుకున్న మల్సూరు గౌడ్. .

కూసుమంచి నవంబర్ 30 ( జనం సాక్షి ) : రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో పాలేరు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హైకోర్టు న్యాయవాది అమరగాని మల్సూరుగౌడ్ తన ఓటు హక్కును తన స్వగ్రామమైన ఈశ్వర మాదారంలో వినియోగించుకున్నారు.

 

 

 

తుడుకుర్తి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి Dr. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డీ  వారి సతీమణి Dr. సరిత
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్జనంసాక్షినాగర్కర్నూల్మండలం తూడుకుర్తి  గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  డాక్టర్.కూచుకుల్ల రాజేష్ రెడ్డి వారిసతీమణిడాక్టర్సరితతమఓటుహక్కునువినియోగించుకున్నారుప్రజలుఅందరూతమఓటుహక్కువినియోగించుకోవాలని కోరారు.. రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును నియోజకవర్గ ప్రజలందరూ స్వచ్ఛందంగావినియోగించుకోవాలని వారు నియోజకవర్గంలో కోరారు.

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఓటు వేస్తున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. (కరీంనగర్ జిల్లా )

 

 

కామారెడ్డి బి జె పి అబ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి 42వ వార్డు ఒడ్డెర కాలని లో తన ఓటుహక్కు వినియోగచు కున్నాడు..

 

 

 

 

 

 

 

 

 

ఇల్లందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ ఓటు వినియోగించుకున్నారు

 

 

 

ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

 

ఇల్లందు బీఎస్పీ అభ్యర్థి బాదావత్ ప్రతాప్ నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

హుస్నాబాద్ లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

 

 

 

హుజురాబాద్ మండలం సింగాపూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్ బాబు.

 

 

ఓటు హక్కును వినియోగించుకున్న సంగారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ వారి సతీమణి కుటుంబ సభ్యులు..

 

 

 

 

 

ఓటు హక్కు వినియోగించుకున్న సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో కేంద్రాల వద్దకు తరలివచ్చారు. సోంపేట మండలం గోమారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నర్సాపూర్ బిజెపి అభ్యర్థి మురళి యాదవ్ నర్సాపూర్ పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మాసాయి పెట్టి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న పోటీ అభ్యర్థులు…
నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకాలో అసెంబ్లీ ఎన్నికల పోటీబరిలో ఉన్న పలు పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. బైoసా పట్టణంలోని పులేనగర్ సుభద్రవాటిక శిశుమందిర్ పాఠశాలలో బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకోగా,కాలోనిఆశ్రమ పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ ,దేగంగ్రామంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విట్టల్ రెడ్డి,రువ్వి గ్రామంలో బీఎస్పీ అభ్యర్థి సర్దార్ వినోద్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది కీలకం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ పట్టణంలో బాలికల పాఠశాలలో తమ ఓటు వినియోగించుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్ 30(జనం సాక్షి) కొల్లాపూర్ పట్టణంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వారి దంపతులతో అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును బాలికల ఉన్నత పాఠశాలలోవినియోగించుకున్నారు ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక ప్రజలందరూ తమ ఓటునువినియోగించుకోవాలని వారు కోరారు.

నాగర్ కర్నూల్ పట్టణంలో 115వ పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి తన ఓటును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ పి ఉదయకుమార్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్30( జనం సాక్షి) నాగర్కర్నూల్ పట్టణంలోని 115 వ పోలింగ్ కేంద్రంలో తన ఓటు ను క్యూ లైన్ లో వెళ్లి వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.

_

తాజావార్తలు