ఓ బి సి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించిన యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ నాయకులు…
భువనగిరి. జనం సాక్షి
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభ లో భాగంగా రెండో రోజు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన అఖిలభారత ఓబీసీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దాదాపు భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బిసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఉత్తర ప్రదేశ్,మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ ఒరిస్సా తమిళనాడు, కర్ణాటక కేరళ జార్ఖండ్ పంజాబ్ జమ్ము కాశ్మీర్, రాష్ట్రాల బీసీ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన జాతర శ్రీనివాస్ గౌడ్ ను అఖిలభారత జాతీయ ఓబిసి సంఘాల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా తనని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, దేశంలోని బీసీల జనాభా లెక్కలను వెంటనే చేపట్టాలని, దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేంద్రంలో బడ్జెట్లో బీసీలకు అత్యధిక శాతం బడ్జెట్ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాతర శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు గుండు జ్యోతి, ఝాన్సీ, సతీష్, చారి, వరికుప్పల మధు, బండి రాజు గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు