ఓ స్పాలో జరిగిన అగ్నిప్రమాదం
నోయిడా: నోయిడాలో గురువారం ఓ స్పాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. స్పాను శుభ్రం చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో స్పా ఓనర్‌తో పాటు.. ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆశీర్వాద్ కాంప్లెక్స్‌లో రెండవ అంతస్తుల ఉన్న ఓ స్పాను గత ఏడాది నుంచి మూసివేశారు. కరోనా వల్ల ఆ స్పా తెరుచుకోలేదు. అయితే మళ్లీ తెరిచేందుకు ఓనర్ క్లీనింగ్ చేపట్టారు. ఇదే సమయంలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళ కూడా అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఏసీపీ రజ్నీశ్ వర్మ తెలిపారు. శ్వాస ఆడకపోవడం వల్ల ఆ మహిళ మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు.