కట్జూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదు : కేకే
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మెన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మండిపడ్డారు. కట్జూ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాలని అవసరం లేదని కొట్టి పారేశారు. ప్రత్యేక తెలంగాణ గతంలో పార్లమెంటు ప్రతిపాదించిన అంశమేనన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టు కోవాలని సూచించారు. కట్జూ చెప్పినట్లుగా ఉద్యమం స్వార్థం అయితే నాలుగు కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలోని 8 పార్టీల కోరిక స్వార్థమేనన్నారు. తలెంగాణ కూడా భాషాప్రయుక్త రాష్ట్రమేనని అన్నారు. తెలంగాణ విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలపై రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యల్ని కేకే తప్పుపట్టారు. తన వ్యాఖ్యలతో రేణుక కాంగ్రెస్‌ను ప్రజల నుంచి దూరం చేస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణపై ముఖ్య మంత్రి వ్యతిరేకంగా ఉంటే తామంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల సమావేశాల్లోగా తలంగాణ పై ప్రకటన విడుదల చేయాలని అన్నారు.