కడప చేరుకున్న మహాగర్జన బస్సు యాత్ర

కడప,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): వామపక్షాల మహాగర్జన బస్సు యాత్ర సోమవారం ఉదయం కడప నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ముందుగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌ సర్కిల్‌వద్ద పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు. అనంతరం పాత కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ గఫూర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బాబు, జగన్‌లది కుర్చీలాటని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మోడీ చేసిన వాగ్దానాలన్నీ గాల్లోకలిశాయని విమర్శించారు. రాజకీయ ప్రత్యామ్నాయంతోనే సమూల మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ గఫూర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు మాల్యాద్రి, సుబ్బారావు, అనిల్‌ చంద్రనాయక్‌, రామన్న, లెనిన్‌ బాబు, ధనలక్ష్మి, బి.నారాయణ, సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు రామ్మోహన్‌, వెంకట శివ, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు