కడుపునోప్పితో జాలరి మృతి

తిర్యాని : మండల కేంద్రంలోని చెలిమల వాగు ప్రాజేక్టు (ఎన్టీఅర్‌ సాగర్‌)లో చేపలు పట్టేందుకు వచ్చిన నర్సయ్య (50) సోమవారం ఉదయం మృతి చెందారు. తోటి జాలర్ల కథనం ప్రకారం వరంగల్‌ జిల్లా రేగోండ మండలం బాగర్తి గ్రామానికి చెందిన నర్సయ్యతోపాటు మరో పదిమంది జాలర్లు అదివారం ఉదయం చెలిమల వాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వచ్చినట్లు వారు తెలిపారు.చేపలు పట్టేందుకు వాగులోకి దిగుతుండగా నర్సయ్యకు తీవ్రంగా కడుపునోప్పి రావడంతో స్థానిక అర్‌ ఎంపీ వైద్యునికి మొదట చూపించారు.