కనీసచార్జీలను పెంచాలని సమ్మెకు దిగనున్న ఆటో సంఘాలు

హైదరాబాద్‌: పెట్రోలు, గ్యాస్‌ ధరలు  రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంధర్భంలో ప్రస్థుత ధరలకు అనుగుణంగా ఆటో మీటరు చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆటో సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. కిలో మీటరుకు 11రూపాయల చార్జీతో పాటు పోలీసుల ఈ చలాన్లు సహా మరో 14డిమాండ్ల సాధనకోసం ఆగస్ట్‌ 6వ తేదిన ఒకరోజు బంద్‌కు ఆటో డ్రైవర్స్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బందోలో 15 ఆటో యూనియన్‌లు పాల్గోననున్నట్లు ఆటో సంఘాల నాయకులు తెలిపారు.