కన్నా ఇంటి ఎదుట..  టీడీపీ శ్రేణుల ఆందోళన

– మోడీ, కన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు
– టీడీపీ నేతలకు ధీటుగా బీజేపీ శ్రేణుల ఆందోళన
– పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి
– ఇరువర్గాల ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– నన్ను హతమార్చేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారు
– కేంద్ర ¬ంశాఖకు ఫిర్యాదు చేస్తా
– విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, జనవరి5(జ‌నంసాక్షి) : గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. మోదీ, కన్నా డౌన్‌ డౌన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో శుక్రవారం జరిగిన ‘జన్మభూమి-మావూరు’ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బీజేపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనకు దిగారు. గుంటూరులో ఉంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ధర్నాకు దిగారు. విజయవాడ టీడీపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కన్నా ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వకుండా, ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి మద్దతుగా నిలవడం సిగ్గుచేటన్నారు. వెంటనే కన్నా, ఇతర బీజేపీ నేతలు ప్రత్యేక ¬దాపై  మోదీని నిలదీయాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో కన్నా డౌన్‌డౌన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇది గమనించిన బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని ప్రతిగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నాకు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటా పోటీ నిరసనలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలకు చెదరగొట్టారు. ఆందోళనకు దిగిన ఇరు పార్టీలకు చెందిన ముఖ్యులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌ తరలించారు.
నన్ను హతమార్చేందుకే టీడీపీ కార్యకర్తలు వచ్చారు – కన్నా
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ధర్నాపై కన్నా మాట్లాడుతూ.. తన విూద హత్యాయత్నంపై కేంద్ర ¬ంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. గవర్నర్‌ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను దిగజార్చారని మండిపడ్డారు. సీఎం ఎక్కడికి వెళ్లినా విపక్షాలను గృహనిర్బంధం చేస్తున్నారని విమర్శించారు. కాకినాడలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కార్యకర్తల పట్ల సీఎం అమర్యాదగా ప్రవర్తించారన్నారు. మహిళా కార్పొరేటర్‌ను ఫినిష్‌ చేస్తామని సీఎం అనడం దారుణమన్నారు. సీఎం బెదిరింపులో భాగంగానే టీడీపీ గుండాలు నా ఇంటిపై దాడికి దిగారన్నారు. ఇలాంటి చర్యలకు బీజేపీ భయపడదని, టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాల్పడుతున్న అవినీతిని, పాలనలో వారి చేతగాని తనాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని, తద్వారా వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని కన్నా హెచ్చరించారు.