కన్నుల పండుగగా తిరుమల బ్ర¬్మత్సవాలు
చిన్న శేషవాహనంపై విహరించిన శ్రీవారు
పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం చంద్రబాబు
తిరుమల,సెప్టెంబర్14(జనంసాక్షి): కలియుగ దైవం బ్రహ్మాండ నాయకుని బ్ర¬్మత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్ర¬్మత్సవాల్లో భాగంగా తొలి వాహన సేవలో భాగంగా గురువారం రాత్రి ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామి పెద్దశేషవాహనంపై విహరించారు. శుక్రవారం ఉదయం స్వామివారు చిన్న శేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అల వైకుంఠములో శ్రీమన్నరాయణుడు, సర్పశ్రేష్టుడు, సర్పజాతిలో అగ్రగణ్యుడైన ఆదిశేషువు విూద శయనిస్తుంటారు. ఏడు పడగలు కలిగిన ఆదిశేషుడు స్వామికి శయ్యగా ఉంటాడు. అందుకే అన్నమయ్య తిరుమల కొండలను పదివేల శేషుల పడగల మయముగా వర్ణించాడు. శ్రీ వైకుంఠనాధునికి ఆదిశేషువు తల్పం, తలగడ, ఎండవానల నుంచి రక్షించే ఛత్రం. నిత్యం స్వామిసేవలో ఉండే ఆదిశేషునిపై అనంతశయనుడిని వీక్షించడం ఎంతో పుణ్యదాయకమని భక్తుల అచంచల విశ్వాసం. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా పరిగణిస్తుంటారు. గురువారం రోజు స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. సర్వాంగా సుందరంగా అలంకారభూషితుడైన శ్రీనివాసుడు.. ఉభయదేవురలతో కలసి తిరుమల మాడవీధుల్లో విహరిస్తుండగా.. తిరుమల గిరులు హరినామ స్మరణతో మార్మోగిపోయాయి. తిరుమాడా వీధుల్లో శేషవాహనం దర్శిస్తే నాగదోషాలు పోతాయిని భక్తుల విశ్వాసం. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్బంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్.. అఖిలాండం వద్ద పూజలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం తలకు పరివస్త్రం చుట్టి పట్టు వస్త్రాలను తలపై ఉంచి.. ఆలయ మర్యాదలతో మహాద్వారం వద్దకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, బోర్డు సభ్యులు చల్లా బాబురెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జిల్ల కలెక్టర్ ప్రద్యుమ్న, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.