కన్నుల పండుగగా సిత్ల భవాని ఉత్సవాలు.

జులై 12 (జనం సాక్షి): డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాలకు చెందిన గ్రామాలలో మంగళవారం కన్నుల పండుగగా శీత్ల భవాని ఉత్సవాలను నిర్వహించారు. తెలుగునాట ప్రజలు ఉగాదిని తొలి పండుగ జరుపుకున్నట్లే గిరిజనులు శిత్ల భవాని పండుగను ఆనవాయితీగా సంవత్సరంలో తొలి పండుగగా అత్యంత భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. లంబాడి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలలో సిత్లా భవాని పండుగ ఒక భాగం .ఈ పండుగను పురస్కరించుకుని వివిధ తండాల ప్రజలు, చిన్నలు ,పెద్దలూ కలిసి పురుషులు డప్పు వాయిద్యాలు వాయిస్తూ ,మహిళలు, యువతీ ,యువకులు నత్యం చేస్తూ సందడి సందడి చేశారు. అంతేకాకుండా కొందరు గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా భక్తి పారవశ్యంలో మునిగి పాటలు పాడారు. శిత్ల భవాని దేవతకు గుగ్గిళ్లు, పాయసం, కొత్త బియ్యంతో పరమాన్నం వండి అమ్మవారికి సమర్పించి, కోళు,్ల మేకలను బలి ఇచ్చి వాటి పై నుంచి పశువులను దాటించి , తమ పిల్లా పాపలు, గొడ్డు గోదా ,చల్లగా ఉండేలాగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ,పంటలు బాగా పండాలని శీథ్ల భవాని తల్లి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రూప్లా తండ సర్పంచ్ గుగులోతు లక్ష్మి , మరియు లక్ష్మణ్, శంకర్, హాచ్చు , వెంకన్న స్థానికులు పాల్గొన్నారు