కమ్యూనిటీ హాల్ మంజూరు పట్ల హర్షం
ఆగస్టు 19 (జనం సాక్షి)
ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీలో సిడిపి నిధుల నుండి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 25 లక్షల మంజూరు అవ్వడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కి శుక్రవారం జడ్పిటిసి కొమర హనుమంతు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఆదివాసి సంఘాలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మర్కోడు సర్పంచ్ శంకర్ బాబు, టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమర వెంకటేశ్వర్లు, మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కొమరం సతీష్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు కొమరం రాంబాబు, రాఘవపురం సర్పంచ్ ప్రేమ కల బోడాయికుంట సర్పంచ్ పాయం.వేంకటనారాయణ ,నడిమిగూడెం సర్పంచ్ కొమర నరసింహారావు ,ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.