కమ్యూనిస్టులకు రాజగోపాల్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 11 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో 2018 సంవత్సరంలో సీపీఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ మద్దతుతో కమ్యూనిస్టుల ఓట్లతో దయా దాక్షిణ్యాలతో గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం కాంట్రాక్టు పనులు, కమిషన్లకు కకృత్తి పడి పార్టీని మారి ద్రోహం చేశారన్నారు. కమ్యూనిస్టులను దొంగలు, అమ్ముడుపోయెటోళ్లు అంటూ అవహేళన చేసే విదంగా మతి భ్రమించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నాడు భూమి కోసం, భుక్తి కోసం, సాయుధ పోరాటం చేసి పది లక్షలు ఎకరాల భూమిని పేదలకు పంచి 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. ఏ చరిత్రలేని రాజగోపాల్ రెడ్డి, బిజెపి పార్టీకి రాబోయే రోజుల్లో వారికి ప్రజలు చరమగీతం పాడుతారని తెలిపారు. వెంటనే కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని రాజగోపాల్ రెడ్డిని చిత్తుగా ఓడించి కర్రు కాల్చి వాతలు పెడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి ఉడుగుల శ్రీనివాస్, డివిజన్ నాయకులు వలబోజు నర్సింహా చారి, పుల్లని వేణు, గుడెపు సుదర్శన్, సుంచు సంజయ్, బియ్య రాజు, ఎర్రోళ్ల అఖిల్, సీతారాములు,భోగి మనోహర్, పుల్లని రత్నం,సాతెల్లి భూమయ్య, రాజు, మల్లేష్,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



