కమ్యూనిస్టుల పోరాటాలతోనే ప్రజా హక్కులు కాపాడబడతాయి.
పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల నిర్వహిస్తూ ప్రజా హక్కులు కాపాడబడాలంటే కమ్యూనిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి ఉన్నారు. గురువారం సిపిఐ కురవి మండల 11వ మహాసభను మండల కేంద్రంలో సురేంద్ర కుమార్ సూరి హాల్లో నిర్వహించరు. ఈ సందర్భంగా అరుణ పతాకాన్ని సిపిఐ సీనియర్ నాయకులు బుడమ వెంకన్న ఎగురవేశారు. అనంతరం జరిగిన మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బి విజయ సారథి మాట్లాడుతూ కమ్యూనిస్టులు సమాజంలో బలహీన పడడం వల్ల పాలక పార్టీలు బరితెగించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని ప్రజా హక్కులు కాల రాయబడుతున్నాయని రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు.కమ్యూనిస్టులు బలపడినప్పుడే బలహీన వర్గాల శ్రేయస్సు నిలబడుతుందని ప్రశ్నించే గొంతులు పెరుగుతాయని దానికై ప్రజల ను చైతన్య పరుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింప చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ మహాసభ నరసింగం గురవయ్య అధ్యక్షతన నిర్వహించగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మామిండ్ల సాంబలక్ష్మి ,నెల్లూరు నాగేశ్వరరావు, కర్ణం రాజన్న, బుర్ర సమ్మయ్య, దొంతు రామ్మూర్తి, కన్న వెంకన్న, దూది కట్ల సారయ్య, బసవ కొమరయ్య,రవి,ఉప్పలయ్య, కలగూర నాగరాజు,బొల్లు వెంకన్న, కందుల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.