కమ్యూనిస్టుల విమర్శించే నైతిక హక్కు బాబు మోహన్ కు లేదు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్
కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు బాబు మోహన్ కు లేదని, రాజ్యాంగం రిజర్వేషన్లను తప్పు చేసేందుకు మనువాద బీజేపీ కుట్రలు చేస్తుంటే ఎందుకు మాట్లాడవని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ బాబు మోహన్ కు ప్రశ్నించారు. కమ్యూనిస్టులను పై బాబు మోహన్ విమర్శించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు
ఈరోజు నారాయణఖేడ్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అతిమేల మానిక్ మాట్లడుతూ
 తెలంగాణకు బిజెపి ఏమి చేసిందని బిజెపిలోకి ఎందుకు పోయాడో సమాధానం చెప్పాలని అన్నారు. విభజన హామీలు నెరవేర్చిందా నోట్ల రద్దు చేసి నల్లధనం తీసుకువచ్చిందా?.. జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరవండి ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వేస్తామని అన్నారు ఒక్క పైసైన మోడీ గారు వేశారని అన్నారు  సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు రావాలి ఒక్క ఉద్యోగమైన ఇచ్చారా..  నోట్ల రద్దు జిఎస్టి తో లక్షల పరిశ్రమ మూతపడ్డాయని లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు కార్మికులకు రైతులకు,వ్యతిరేకంగా చట్టాలు తెచ్చినందుకా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మినందుకా? రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నందుకా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పై దాడి చేస్తున్నందుకా తెలంగాణకు బిజెపి ఏమి చేసిందనిబాబు మోహన్ ఎందుకు బిజెపిలోకి వెళ్ళాడో సమాధానం చెప్పాలని అమ్ముడుపోయిన నీవు కమ్యూనిస్టులు అనడం  సిగ్గుచేటు
దళిత నాయకుడు అని చెప్పుకుంటూ ప్రజల మీద దాడి భారత రాజ్యాంగం పైన దాడి రిజర్వేషన్లపై దాడి జరిగిన నోరు మెదపలేని దళిత ద్రోహి నువ్వా విమర్శించేది ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రజల మధ్య మతోన్మాదంతో చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తూ కాలం వెల్లదీస్తుంది తప్ప అభివృద్ధి ఏమాత్రం చేయలేని బిజెపిలోకి పోయింది నువ్వు నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పేద ప్రజల కొరకు కార్మిక కర్షకుల కొరకు నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను కమ్యూనిస్టులు విమర్శిస్తే స్థాయి నీకు లేదు కమ్యూనిస్టులు జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు
ఈ సమావేశంలో సిపిఎం నారాయణఖేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి చిరంజీవి, నాయకులు కొటారి నరసింహులు, రాజ్ కుమార్ సంజీవ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.