కమ్యూనిస్టు యోధురాలు.. కోటేశ్వరమ్మ కన్నుమూత
– సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబర్19(జనంసాక్షి) : కామ్రేడ్ కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖలోని కృష్ణా కాలేజ్ సవిూపంలో నివాసముంటున్న తన మనవరాలు అనురాధ ఇంటి వద్ద ఆమె తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ ఆగస్టు 5వ తేదీన కుటుంబసభ్యులందరి సమక్షంలో 100వ జన్మదినం జరుపుకున్నారు. ఈ నెల 10వ తేదీన అనారోగ్యానికి గురై అప్పటినుంచి మృత్యువుతో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ కోరిక మేరకు ఆమె మృతదేహాన్ని విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి
అప్పగిస్తామని ఆమె చిన్న మనవరావు సుధ విూడియాకు తెలిపారు. తొలితరం కమ్యూనిస్టు యోధురాలిగా కోటేశ్వరమ్మకు కమ్యూనిస్టు చరిత్రలో ఓ అధ్యాయం ఉంది. ప్రముఖ నక్సల్ నేత కొండపల్లి సీతారామయ్యకు ఆమె సతీమణి. ఐక్య కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి రెండుగా చీలిపోవడం, అతివాద ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు. మంచి గాయనిగానూ పేరుంది. రచయిత్రిగా ‘నిర్జన వారధి’ పుస్తకం ఆమెను సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిపింది. కోటేశ్వరమ్మ మృతిపట్ల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు.