కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన దీక్ష భగ్నం
కరీంనగర్, ఆగస్టు 24 : జిల్లాలోని చిగురుమామిడిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీక్ష విరమించాలంటూ పోలీసులు చెప్పినా వినకపోవడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయను అరెస్ట్ చేసి, నిరసన దీక్షను భగ్నం చేశారు.