కరీంనగర్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కరీంనగర్ లో ధూమ్ ధామ్ గా సాగుతున్నాయి. నగరంలోని సర్కస్ గ్రౌండ్ లో సంబురాలు అంబరాన్నంటాయి. కళాకారులు జానపద, పేరిణి, కూచిపూడి నృత్యాలతో అలరించారు. ఈ వేడుకలకు మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు అందజేశారు. ఉత్సవాల్లో జెడ్పీ చైర్మెన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




