కరీంనగర్లో వివాహిత కిడ్నాప్
కరీంనగర్, : మతాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో యువతిని కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. పెందుర్తి మండలం, తణుగులకు చెందిన అజీజ్.. కతలింగం ప్రాంతానికి చెందిన దీపిక మార్చి 28న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు అజీజ్ ఇంట్లో జొరబడి… అతనిపై దాడి చేసి… దీపికను కారులో ఎత్తుకు వెళ్లారు. తమ వివాహానికి ఒప్పుకోని దీపిక తల్లిదండ్రులే కిడ్నాప్ చేయించారని అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నలుగురు వ్యక్తులు కారులో వచ్చి దీపికను కీడ్నాప్ చేశారు. పెందుర్తి ఎస్ఐ కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు