కరీంనగర్‌ : ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

రామగుండం, ఆగస్టు 28 : రామగుండంలోని ఎన్టీపీసీ ఒకటో యూనిట్‌లో బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ అయింది. ఈ సంఘటనతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం వాటిల్లింది. దీంతో విద్యుత్‌ అవస్థలు ఏర్పడే ప్రమాదముంది, విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ఎన్టీపీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.