కరీంనగర్ జిల్లాలో నేడు రెండో రోజు పాదయాత్ర
కరీంనగర్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో రెండో రోజుకు చేరింది. గర్రిపల్లి, రేగుంట, ఇటిక్యాల, రాయికల్ గ్రామాల్లో నేటి యాత్ర కొనసాగనుంది. మొత్తం 9 కిలోమీటర్ల మేర చంద్రబాబు యాత్ర సాగనుంది.