కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

– దెబ్బతిన్న పంటలు
కరీంనగర్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోరుట్ల, మెట్‌పల్లి మండల్లాల్లో 20 వేలు ఎకారాల్లో పంటనష్టం జరిగింది. మేడిపల్లి  మండలంలో వడగళ్ల వానతో 1500 ఎకరాల్లో పంట దెబ్బతింది. తొంబ్రావుపేటలో రేకుల షెడ్డు కూలడంతో ఒకరికి గాయాలయ్యాయి మెట్‌పల్లి మార్కెట్‌యార్డ్‌లో అకాల వర్షానికి పత్తి బస్తాలు తడిసిపోయాయి.