కరీంనగర్‌ : బొగ్గు చోరీ చేస్తూ… రైలు కింద పడి…

కమాన్‌పూర్‌, ఆగస్టు 18 : బొగ్గు చోరీకి వెళ్లి ఓ యువకుడు మరణించిన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కమాన్‌పూర్‌ మండలం అల్లూరులో గూడ్స్‌ రైలు నుంచి బొగ్గు చోరీ చే స్తూ రైలు కింద పడి భూక్యా శ్రీనివాస్‌ అనే యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు