కరీంనగర్ జిల్లాలో… ఎంపీ కవిత పర్యటన
కరీంనగర్, ఆగస్టు 19 : నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత బుధవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ‘మన పల్లెలో మన ఎంపీ’ పేరుతో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన ఎంపీ గత నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం సారంగాపూర్ మండలం మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా తామెదుర్కొంటున్నఆయా సమస్యలను అక్కడి ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పెంబంట్లలోని దుబ్బా రాజేశ్వరస్వామి దేవాలయంలో ఎంపీ పూజలు నిర్వహించారు.