కరీంనగర్ జిల్లాలో 14ఏళ్ల బాలుడి దారుణ హత్య
కరీంనగర్:జిల్లాలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం సత్తెక్కపల్లి శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ దాబాలో పనిచేస్తున్న బాలుడి(14)ని హత్యచేశారు. దాబాలో పనిచేస్తున్న తోటి పనివాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డట్లు మరో సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.