కరీంనగర్: నేడు ఎమ్మెల్యే పర్యటన
కోనరావుపేట : నేడు కోనరావుపేటలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పర్యటించనున్నట్లు మాజీ ఆలయ చైర్మన్ ప న్నాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మామిడిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేడు మామిడిపల్లిని సందర్శించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు