కరీంనగర్: రూ.40 కోట్ల నిధులపై ప్రజలకు స్పష్టతివ్వాలి
కోనరావుపేట : గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మండలానికి రూ.40 కోట్లు మంజూరు చేశామని చెప్పుకుంటున్న నా యకులు వాటిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బీజేపీ మండల అ ధ్యక్షుడు సురేందర్‌రావు అన్నారు. కోనరావుపేటలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమానికి కంటే ముందే రూ.40 కోట్లు మంజూరు చేశామని అంటున్నారన్నారు. వాటిలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నిధు లు ఎన్ని ఉన్నాయని ప్రజలకు వివరించాలన్నారు. నేటి నుంచి గ్రామజ్యోతి కార్యక్రమాలు నిర్వహించనున్న క్రమంలో ఈ నిధు ల ప్రొసీడింగ్‌ను కూడా గ్రామసభలో చూపించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అంబోజ లక్ష్మినారాయణ, బా లాజి, జింక వెంకటి తదితరులు ఉన్నారు