కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం..
కరీంనగర్:పెద్దపల్లి మండలం నిమ్మలపల్లిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది ఈత, తాటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. నిమ్మలపల్లి గ్రామంలో దాదాపు 50 కుటుంబాలను ఈ చెట్లపైనే జీవనం సాగిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో గీత కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో తమను ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వినతి వేడుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.