కరీంనగర్ లో సైన్స్ ఫేర్..
కరీంనగర్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దేందుకే ప్రభుత్వం సైన్స్‌ఫేర్‌లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. కరీంనగర్ ఆల్పోర్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి” ఇన్స్పైర్” కార్యక్రమానికి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పిల్లలు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రయోగలను రెబ్బన్ కట్ చేసి తిలకించారు. పిల్లలు తయారు చేసిన ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలను వాటి వివరాలు అడిగి అవి పనిచేసే విధానాన్ని తెలుసుకున్నారు. చేయబోయే ప్రయోగాలు, రాబోయే ప్రమాదాలను అరికట్టే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా చిన్నరులు ప్రదర్శించిన డ్యాన్స్‌లు సందర్శకులను ఆకట్టుకున్నాయి