కరీమాబాదులో యు బ్లడ్ యాప్ అవగాహన సదస్సు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి)

 

కివి పబ్లిక్ స్కూల్ కరీమాబాద్ క్యాంపస్ లో పాఠశాల ప్రిన్సిపల్ దాసి.సతీష్ మూర్తి,వైస్ ప్రిన్సిపాల్ అన్నదేవ ర ప్రవీణ్ కుమార్ గార్ల సహకారంతో యూబ్లడ్ ఆప్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసి సతీష్ మూర్తి మాట్లాడుతూ
యు బ్లడ్ప్ యా అనేది అనేది కష్ట కాలంలో ప్రాణాపాయ స్టితిలో పేషెంట్ కి డోనర్ కి మద్య వారధిగా పని చేస్తుందని, మరియు ఎమర్జెన్సీ సమయంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యు బ్లడ్ యాప్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, మరో 10 మందికి అవగాహన కల్పించాలని కోరారు.వైస్ ప్రిన్సిపాల్ అన్నదేవార ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి నిరుపేద కుటుంబాలకు ఒక గొప్ప సంజీవని మరియు పేదల ఆపన్న హస్తం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా
యు బ్లడ్ యాప్ ఫౌండర్ జగదీశ్ బాబు యలమంచిలిని
కివి పాఠశాల యాజమాన్యం, మరియు
సిబ్బంది తరపున ప్రత్యేకంగా అభినందించారు.
సోనుసూద్ లాంటి సామాజిక సేవ బాధ్యత గల బాలీవుడ్ నటుడు యు బ్లడ్ ఆప్ కి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై ఆనందం వ్యక్తం చేశారు.చివరగా సామాజిక వేత్త, యు బ్లడ్ కమ్యూనికేషన్ మేనేజర్ చిలివేరు శంకర్ ని ఘనంగా సన్మానించారు.