కరుణానిధికి మరోమారు అస్వస్థత

కావేరీ ఆస్పత్రిలో చేరిక

చెన్నై,జూలై18(జ‌నం సాక్షి): డీఎంకే అధినేత కరుణానిధిని బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని స్వల్పశస్త్ర చికిత్సకోసం ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా కరుణానిధి గొంతు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని చూసేందుకు ఆయన అభిమానులు కావేరీ ఆసుపత్రికి తరలివెళుతున్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. వయసువిూద పడడంతో తరచూ ఆయన అనారోగ్యానికి గురవుఉతన్నారు.

శ్వాస నాళాల సంబంధిత చికిత్స కోసం ఆయన ఇక్కడి కావేరీ ఆస్పత్రిలో చేరినట్టు డిఎంకె వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కరుణానిధి కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పక్రియలో భాగంగా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ట్రాకియోటవిూ ట్యూబ్స్‌ (శ్వాస నాళాలు) మార్చాల్సి ఉంటుందని, ఈ చికిత్స కోసమే కరుణానిధి ఆస్పత్రిలో చేరారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.