కరుణానిధి గురించి విదేశీ విూడియాల్లో సంతాపం

న్యూఢిల్లీ, ఆగస్టు8(జ‌నం సాక్షి) : రాజకీయ, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న కరుణ మృతిపై విదేశీ విూడియా కూడా సంతాపం వ్యక్తం చేసింది. భారత్‌లో రాజకీయ, సినీ రంగాలు ఉన్నన్ని రోజులూ భారతీయుల ఆయన్ని గుర్తించుకుంటారని పలు విూడియాలు పేర్కొన్నాయి. వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. రాజకీయ, సినీ రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. తమిళ సినీరంగంలో ఆయన 1950లలో ప్రవేశించారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో సేవలు చేశారు. 1969తొలిసారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు 19సంవత్సరాల పాటు పలుమార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. డీఎంకే పార్టీ అధినేతగా ఎన్నో సంవత్సరాలు కొనసాగారు’ అని రాసింది. అదేవిధంగా మరో అంతర్జాతీయ విూడియా అయిన సీఎన్‌ఎన్‌ కూడా కరుణ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంది. 14ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారని, 1969లో కరుణ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారని, డీఎంకే అధినేతగా కూడా కొనసాగారుని, తమిళనాడు ప్రజలకోసం ఎన్నో సేవలు చేశారని రాసుకొచ్చింది. అదేవిధంగా తమిళనాడు ప్రజల ఆరాధ్యదైవం ఆరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. ఆయన రాజకీయ బ్రహ్మ. తుదిశ్వాస వరకూ డీఎంకే అధినేతగా కొనసాగారు. అప్పట్లో కులవిద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడారంటూ బీబీసీపేర్కొంది. మరోవైపు సేలన్‌ టుడే(శ్రీలంక) పత్రిక కూడా కరుణానిది మరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. తమిళనాడు ప్రజల హీరోగా కొనసాగిన ఆరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు. పేదలకు ఆయన ఆరాధ్యదైవం. తమిళనాడులో ఇక ఆయన శకం ముగిసినట్లే. ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు’ అని తెలిపింది.
—————————–