కరోనాతో ఆసుపత్రిలో చేరిన స్టాలిన్
చెన్నై,జూలై14(ఆర్‌ఎన్‌ఎ): తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్న కావేరి ఆస్పత్రిలో ఆయన చేరారు. జూలై 12వ తేదీన ఆయన కోవిడ్ పరీక్షలో
పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఉన్న కారణంగా సీఎం స్టాలిన్ హాస్పిటల్‌లో చేరారని, ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, అబ్జర్వేషన్‌లో ఉంచామని హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆకాంక్షించారు.