కరోనా కేసులు తగ్గుముఖం
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,25,760 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,44,264 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉందయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 51 మంది కరోనాకు బలవగా, 16,069 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.