కరోనా నిధుల మళ్ళింపు వ్యవహారం
తిరిగి బదిలీ చేయాలని ఎపికి సుప్రీం ఆదేశం
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించడంపై సుప్రీం ఆగ్రహం వయక్తం చేసిది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. పిడి ఖాతాలకు మళ్ళించిన కొవిడ్ నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డీఆర్‌ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం ఆదేశించింది. పిడి ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 11 వందల కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లో ఫిర్యాదును పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.