కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం
` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి
` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం
` అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ రాజ్యమేలుతున్నారు
` మోడీ ఎన్నిసార్లు వచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ఖతం
` కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో కర్నాటక సిఎం సిద్దరామయ్య
కామారెడ్డి(జనంసాక్షి):తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం..కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం..అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి..తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వచ్చి చూడండి..అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ రాజ్యం ఏలుతున్నారుమోడీ ఎన్నిసార్లు వచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ఖతం.. అని కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కామారెడ్డి వేదికగా కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన వ్యూహాలను అమలు చేస్తోంది. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి నేడు నామినేషన్‌ వేయగా, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తమ ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేస్తామని సిద్ధరామయ్య హావిూ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలని కేసీఆర్‌కు చెప్పారు. కేసీఆర్‌ కర్ణాటకకు వస్తే దగ్గరుండి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీంలను పక్కాగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్‌ కు బీజేపీకి తేడా ఏవిూ లేదని, బీఆర్‌ఎస్‌.. బీజేపీ బీ టీం అని ఆరోపించారు. తెలంగాణకు మోదీ 100 సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 సభలు పెట్టారని, రోడ్‌ షోల్లో విపరీతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రధాని మోదీ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్‌ పార్టీనే గెలిచిందని అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదని అన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీసీల వెనుకబాటు తనానికి ప్రధాని మోదీనే కారణమని అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని సిద్ధరామయ్య విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి చిత్తుగా ఓడిస్తారని సిద్దరామయ్య అన్నారు. కామారెడ్డితో పాటు, గజ్వేల్‌ లో కూడా సీఎం కేసీఆర్‌ ఓడిపోతారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్‌ ను ఆశీర్వదించాలని అన్నారు. రేవంత్‌ రెడ్డి కామారెడ్డితో పోటు కొడంగల్‌ కూడా రెండు చోట్ల గెలుస్తారని అన్నారు. బీసీల 34 రిజర్వేషన్లు 25 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌ కే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ అవినీతి డబ్బును ఖర్చు చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపు ఇచ్చారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనైపోయిందని సిద్ధరామయ్య అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి నాలుగైదు సీట్లు వస్తే అవే చాలా ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ వంద సార్లు వచ్చి ప్రచారం చేసినా బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. మోడీ ఎక్కడ ప్రచారం చేశారో అక్కడే కాంగ్రెస్‌ ఎక్కువ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. మోడీని నమ్ముకున్న కర్నాటక బిజెపి నేతలు ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారని తెలిపారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు.. కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్‌ సభ నిర్వహించింది. బిసి డిక్లరేషన్‌ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్‌, సిపిఐ నేత నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ  బిసి డిక్లరేషన్‌ ను ప్రకటించింది. అనంతరం సిద్ధరామయ్యా మాట్లాడుతూ. బిసి సబ్‌ ఎª`లాన్‌ అమలు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామన్నారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల, బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేవంత్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై పోటీ చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి మరో చోట కూడా పోటీ చేస్తున్నారు. సిఎం కెసిఆర్‌ కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారని వెల్లడిరచారు. రెండు చోట్లా రేవంత్‌ రెడ్డి, కెసిఆర్‌ పై భారీ మెజారిటీతో రేవంత్‌ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కెసిఆర్‌ ప్రయత్నిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కెసిఆర్‌ ను ఓడిరచాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఓటుతో కెసిఆర్‌ ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

 

అధికారంలోకి రాగానే కులగణన
` ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు
` స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
` నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు
` గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25శాతం కేటాయింపు
` ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు
` జనగమాకు సర్దార్‌ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం
` కామారెడ్డిలో కాంగ్రెస్‌ బిసి డిక్లరేషన్‌ ప్రకటన
కామారెడ్డి(జనంసాక్షి): తెలగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కుల గణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హావిూ ఇచ్చింది. బీసీ`డీలో ఉన్న ముదిరాజులను బీసీ`ఏ లోకి మారుస్తామని, నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని హావిూ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్‌ సభలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రకటించింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీతో, టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌, కమ్యూనిస్టు ముఖ్య నేతలతో పాటు పలువురు నాయకులు హాజరైన ఈ సభలో బీసీలకు కీలక హావిూలు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ 42 శాతం పెంచుతామని, బీసీ సబ్‌ ప్లాన్‌ ప్రవేశ పెట్టడంతో పాటు వైన్‌ షాపులో గౌడ్లకు ప్రస్తుతం ఇస్తున్న 15 రిజర్వేషన్‌ 25 శాతానికి పెంచుతామని పేర్కొంది. జనగామ జిల్లాను సర్వాయి పాపన్న సర్దార్‌ పాపన్న పేరు పెడుతామని, ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్ల ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో మూడు చోట్ల మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తమని హావిూ ఇచ్చింది. ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. ప్రతి జిల్లాకు బీసీ భవన్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.బీసీ సబ్‌ ప్లాన్‌ ను ప్రవేశపెట్టనున్నట్టుగా కాంగ్రెస్‌  హావిూ ఇచ్చింది.   ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్లను ఖర్చు చేయనున్నట్టుగా  కాంగ్రెస్‌ వివరించింది.   బీసీ కార్పోరేషన్‌ ద్వారా ఒక్కొక్కరికి  రూ. 10 లక్షల రుణ సౌకర్యం అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. చేనేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్‌ అందిస్తామని కాంగ్రెస్‌ హావిూ ఇచ్చింది. జనగామ జిల్లాను సర్దార్‌ సర్వాయి పాపన్న జిల్లాగా మారుస్తామని  హస్తం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో  మూడు చోట్ల మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ తెలిపింది.

కామారెడ్డి భూములు కొల్లగొట్టే కుట్ర
` అందుకే కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ
` నామినేషన్‌ దాఖలు చేసిన రేవంత్‌
కామారెడ్డి(జనంసాక్షి): తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది  కామారెడ్డి ప్రజలేనని  తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బిఆర్‌ఎస్‌కు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోందన్నారు. అంతకుముందు కామారెడ్డి ఆర్వో కార్యాలయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు. రేవంత్‌ రెడ్డి వెంట ఆర్వో కార్యాలయానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ బిసి డిక్లరేషన్‌ సభను నిర్వహించింది. ఇందులో రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించ బోతున్నారని, బిఆర్‌ఎస్‌కు ఇక్కడి ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోంది. గజ్వేల్‌ ప్రజలను కేసీఆర్‌ పదేళ్లపాటు మోసం చేశారు. కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్నుపడిరది.. అందుకే పోటీ చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ మాది ఇదే ఊరని చెప్తున్నారు. కోనాపూర్‌లో నీ తల్లి గారి ఊరే అయితే ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోలేదదో ఎందుకు చెప్పలేదని నిలదీసారు. కామారెడ్డిని బంగారు తునక చేస్తా అంటున్న నువ్వు గజ్వేల్‌లో ఏం చేసినవో ఎందుకు చెప్పలేదన్నారు.  గజ్వేల్‌ ప్రజలు నీకు అండగా ఉంటే కామారెడ్డికి ఎందుకు వచ్చినట్లని ప్రశ్నించారు. కామారెడ్డిలో మాస్టర్‌ ప్లాన్‌తో భూములు కొల్లగొట్టడానికి వస్తున్నారని, రైతులు ఇది గుర్తించాలని హెచ్చరించారు. షబ్బీర్‌ అలీ ఓడినా, గెలిచినా విూ వెంటే ఉన్నారు. గంప గోవర్ధన్‌ తన సీటు పోయిందని ఏడుస్తున్నారు. రెండుసార్లు సీఎం అయి లక్ష కోట్లు సంపాదించారు. ఆయన మనవడికి మంత్రి పదవి కోసం మరోసారి సీఎం అవుతాడట. కేసీఆర్‌ను బొంద పెట్టాలని కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని అన్నారు. షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ నామినేషన్‌ వేశాను. 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, ఇద్దరు ఎంపీలను కొన్న కేసీఆర్‌ నాపై ఆరోపణలు చేస్తాడా. ఈ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా.. నువ్వు సిద్ధమా?. సీబీఐ కి లేఖ రాయి.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయి. కామారెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అని రేవంత్‌ రెడ్డి అన్నారు.