కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం
బస్సు,లారీ ఢీకొని 9మంది దుర్మరణం
బెంగళూరు,మే24(జనంసాక్షి): కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ `ధర్వాడ్‌లో పుణెళి ? బెంగళూరు హైవేపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. కొల్లాపూర్ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి.
ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనిర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుంబీలోని ఆసుప్రతికి క్షతగాత్రులను తరలించారు. 23 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను హుబ్లీ
కమిషనర్ పరామర్శించారు.