కలాల కవాతును విజయవంతం చేయండి : కోదండరాం

మీడియా యాజమాన్యాలు సహరించండి : అల్లం
హైద్రాబాద్‌, అక్టోబర్‌28(జనంసాక్షి): ఈనెల 30న తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కలాల కవాతును విజయవతంత చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు. జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా ప్రధాని పర్యటన నేపధ్యంలో జర్నలిస్టులపై చూపిన వివక్ష సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిసుట్లపై జరిగిన దాడి కేవలం వారికి సంబంధించినది మాత్రమే కాదని ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇది తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్షలో ఇదో భాగమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టులంతా చేతి కళంతో, పోటెత్తిన గళాలతో కధనోత్సవంతో కలం కవాతుకు తరలి రావాలన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టూ ఈ కలాల కవాతుకు హాజరయి తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని చాటాలన్నారు. టీజేఏఫ్‌ కన్వీనర్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ ఈ నెల 30న హైదరాబాద్‌లో జరిగే కలాం కవాతుకు తెలంగాణ జర్నలిస్టులంతా కదలి రావాలన్నారు. ఇది ఒక మీడియాకు సంబంధించిన సమస్య కాదని యావత్‌ తెలంగాణకు జరిగిన అన్యాయమన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ఆత్మగౌవంపై జరిగిన దాడేనని, కావున ఈ కవాతుకు మీడియా యాజమాన్యాలు సహకరించాలని కోరారు. సీమాంధ్ర పాలనలో ప్రధాని సాక్షిగా తెలంగాణ జర్నలిస్టులు కూడా వెలివేయబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కవాతు తెలంగాణ సమాజమంతా అండగా నిలవాలని కోరారు.