కళాశాలలో ప్రవేశ రుసుము రద్దు చేయాలి
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న రుసుమును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళాశాలలో విభాగాల వారిగా విద్యార్థుల నుంచి 500 నుంచి 820 రూపాయల వరకు ప్రవేశ రుసుము కింద వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని 42 క ళాశాలలో ఈ ప్రవేశ రుసుమును వసూలు చేస్తున్నందున పేద విద్యార్థులకు కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అధిక ఫీజు విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యపై ఇన్‌ఛార్జి జాయింట్ కల ెక్టర్‌కు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.