కవిటిలో 30 పడకల ఆస్పత్రి

ప్రారంభించిన మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ ఉపాధి కల్పన చేనేత జౌళి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రమైన కవిటిలో 30 పడకల ఆసుపత్రిని సోమవారం ప్రారంభించారు. నాబార్డు, ఆర్‌ఐడిఎఫ్‌ వారు సంయుక్తంగా 3.30 కోట్ల రూపాయలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించేందుకు, డయాలసిస్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సభ్యులు కింజరపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌, మాజీ ఆంధ్రా బ్యాంక్‌ డైరెక్టర్‌ బెందాళం ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు